ఫైజాబాద్‌ : ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. సిద్ధార్థ్ నగర్‌కు బయలు దేరిన ఆయన హెలికాప్టర్‌ను ఫైజాబాద్‌లోనే దించేశారు. వాతావరణంలో హఠాత్తుగా వచ్చిన మార్పులే దీనికి కారణంగా. సీఎం హెలికాప్టర్ అత్యవసరంగా దిగడంతో అధికారులు ఆందోళన చెందారు. ఉరుకులు పరుగుల మీద ఆ ప్రదేశానికి వెళ్లారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ హుటాహుటిన అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో సీఎం సిద్దార్థ్ నగర్‌కు వెళ్లారు