" శ్రీహేవళంబినామ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరింత  అభివృద్ధి పథంలో  నడవాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి. 
 ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఏడు అంగన్వాడీలను ప్లే స్కూళ్లుగా అందుబాటులోకి తీసుకొచ్చి కేజీ టు పీజీ విద్యను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాం.
కొత్త సంవత్సరంలో కొత్తగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ  గురుకులాలు మరిన్ని ప్రారంభం కానున్నాయి.
ఉచిత విద్య..ఉత్త విద్య కాకుండా నాణ్యమైన విద్య కావాలన్నదే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది.
మెస్ చార్జీలు, ఉపకార వేతనాల పెంపుతో విద్యార్థులకు ఉగాదిని ముఖ్యమంత్రి కెసిఆర్ ముందే తీసుకొచ్చారు.
శ్రీ హేవళంబినామ సంవత్సరం విద్యానామ సంవత్సరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు మరోసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు."