సిపిఐ రాష్ట్ర కార్యాయలంపై ముష్కరుల దాడి 
దాడి మతోన్మాద శక్తుల పనే 
ముష్కరులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి 
జరిగిన సంఘటనపై డిజిపి, సిపిలకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన చాడ వెంకట్ 
తీవ్రంగా ఖండించిన జాతీయ కార్యదర్శి డాక్టర్  కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి.

 హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్ ఆగంతకులు దాడి చేశారు. హైదరాబాద్ హిమాయత్ ఉన్న సిపిఐ కార్యాలయం లోపలికి ఆదివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చారు. పార్టీ కార్యాలయంలో ఉన్న రెడ్ సురేందర్ ఒక వ్యక్తి తెలుగు అకాడమీ ఎక్కడ అని అడుగుతుండగా మరో వ్యక్తి పెద్ద కర్రతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ చెందిన ఇన్నోవా వాహనంపై దాడికి దిగాడు. ఈ దాడిలో కారు ముందు వైపు, ఎడమ వైపు అద్దాలు ధ్వంసం అయ్యాయి. వెనకవైపు కూడా దాడి చేయడంతో కారు దెబ్బతిన్నది. అగంతకులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రెడ్ సురేందర్ కూడా దాడికి యత్నించారు. కారు అద్దాలు ధ్వంసం చేసిన వెంటనే అగంతకులు బైకుపై అక్కడి నుంచి పరిపోయారు. ఈ విషయాన్ని కార్యాలయ సిబ్బంది సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ తెలియజేయడంతో వారు హుటాహుటిన కార్యాలయాలనికి చేరుకున్నారు. వెంటనే డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ చాడ వెంకట్ ఫోన్ ద్వారా జరిగిన సంఘటన వివరాలను తెలియజేశారు. మగ్ధుంభవన్ జరిగిన జరిగిన సంఘటనను ఆషామాషిగా తీసుకొవద్దని, దాడికి పాల్పడిన ముష్కరులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపి, కమిషనర్లను చాడ వెంకట్ కోరారు. మరోవైపు పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి గురించి నారాయణగూడ పోలీసులకు సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇ.టి.నరసింహా ంహ  ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన నారాయణగూడ ఇన్ రమేష్ కుమార్ మగ్ధుంభవన్ వచ్చి విచారణ చేపట్టారు. కార్యాలయ సిబ్బంది నుండి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

ముష్కరులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి 
డాక్టర్ నారాయణ, చాడ వెంకట్  

ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి, డాక్టర్ కె.నారాయణలు  మీడియాతో మాట్లాడుతూ మతోన్మాద శక్తులతో సంబంధం ఉన్న వారే  దాడికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు. విధానపరమైన రాజకీయ వైరుద్యాలు సహజంగా ఉంటాయని, కానీ పార్టీ కార్యాలయాలపై భౌతిక పరమైన దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మతోన్మాద శక్తులతో సంబంధాలున్న వారే దాడిలో పాల్గొని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన ముష్కరులను పోలీసులు అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

 

సిపిఐ కార్యాలయంపై దాడికి సిపిఐ (ఎం) ఖండన
సిపిఐ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడంతో పాటు అదే ఆవరణలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వాహనాన్ని గుర్తుతెలియని అగంతకులు ధ్వంసం చేయడాన్ని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై పోలీసులు తక్షణం సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం  డిమాండ్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే చాడ వెంకట్ తమ్మినేని ఫోన్ చేసి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.