హైద‌రాబాద్‌:  ప్రస్తుతం లాక్‌డౌన్‌ టైమ్‌ను కుటుంబంతో పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు హీరో మహేష్‌బాబు. కుమార్తె సితార, కొడుకు గౌతమ్‌లతో ఆనందంగా కాలాన్ని గడుపుతున్నారు. వారి హంగామా తాలూకు ఫొటోలు సోషల్‌మీడియాలో ప్రస్తుతం అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సితార, గౌతమ్‌లతో మహేష్‌ దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్రత పోస్ట్‌ చేసింది. ఇందులో క్లీన్‌షేవ్‌తో కళ్లద్దాలు ధరించి నయా అవతారంలో మహేష్‌ కనిపిస్తున్నారు. ఈ కొత్త లుక్‌ వైరల్‌గా సోషల్‌మీడియాలో మారింది.  ‘సరిలేరునీకెవ్వరు’తో  సంక్రాంతికి ప్రేక్షకుల్ని పలకరించారు మహేష్‌.  ఈ సినిమా తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారాయన.