ఇండియాలో టిక్ టాక్ బ్యాన్.?
Posted on: May 20 2020
ఢిల్లీ : టిక్‌టాక్ యాప్ దాదాపు ఢమాల్ అవుతోంది. సోషల్ మీడియాలో ‘బ్యాన్ టిక్‌టాక్ ఇండియా’ అనే పేరోతో క్యాంపెయిన్ నడుస్తుండగా.. అసలు ఈ వివాదం ఎక్కడ ప్రారంభమైందనే చర్చ సాగుతోంది. ఫైజల్ సిద్దిఖీ అనే టిక్ టాకర్ యాసిడ్ అటాక్ ను ప్రతిబింబించేలా చేసిన వీడియో వివాదానికి కారణమైంది. దీనికి తోడు చైనా యాప్ అనే పేరు కూడా టిక్‌టాక్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్ కు కారణమైంది. కాగా.. 2019 ఏప్రిల్‌లో మద్రాస్ హైకోర్టు తీర్పుతో ఈ యాప్‌ని కేంద్రం నిషేధించింది. ఐతే… ఇకపై తగిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం చెప్పడంతో… కొన్ని రోజులకే కేంద్రం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ఏడాది గడిచింది. అయినా పరిస్థితి మారలేదు. ఇప్పుడు మరింత ఎక్కువగా హింసాత్మక, వివక్షాపూరిత వీడియోలు ఈ యాప్‌లో కనిపిస్తున్నాయి. ఈ యాప్‌ని ఇలాగే వదిలేస్తే… ఇది దేశానికే ప్రమాదకరం అంటున్నారు చాలా మంది.