హైదరాబాద్ : ఆషాడ మాసం అమ్మవారి బోనాల జాతరలో ఒక ఆకతాయి మద్యం మత్తులో ఎస్.ఐను ముద్దు పెట్టకున్నాడు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ‌్తే..ఆషాడ మాసం అమ్మవారి బోనాల జాతరలో మద్యం మత్తులో విద్యా నగర్ టీఆర్టీ క్వార్టర్స్ సమీపంలో డాన్సు చేస్తూన్నాడు. అదే సమయంలో బందోబస్తు  డ్యూటిలో అటుగా వెళ్తున్న నల్లకుంట ఎస్.ఐ మహేందర్ ను ఒక ఆకతాయి ముద్దు పెట్టుకున్నాడు. ఈ సందర్బన్ని పక్కనవున్నావారు సెల్ లో వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనంతరం ఆకతాయిని బానుగా గుర్తించి, కేసు నమోదు చేసి, నల్లకుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.