త్రిదండి చినజీయర్ స్వామిని పరామర్శించిన కేసీఆర్
Posted on: Sep 14 2020
రంగారెడ్డి జిల్లా: త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. చినజీయర్ స్వామికి ఇటీవల మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మంగతాయారు(85) అనారోగ్యంతో పరమపదించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ ఆశ్రమానికి విచ్చేసి చినజీయర్ స్వామిని కలిసి పరామర్శించారు. సీఎంతో పాటు మైంహోం రామేశ్వరరావు ఉన్నారు.