హైద‌రాబాద్‌: క‌రోనాతో పోరాడుతూ కోలుకున్న‌ట్టు క‌నిపించిన ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం(74) కొద్ది సేప‌టి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆగ‌స్ట్ 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో చేరిన బాలు గ‌త 50 రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కీల‌క అవ‌య‌వాల‌పై క‌రోనా ప్ర‌భావం చూప‌డంతో శ్వాస స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న బాలుకు వెంటిలేట‌ర్‌తో పాటు ఎక్మో సపోర్ట్ కూడా అందించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత క్షీణించ‌డంతో మ‌ధ్యాహ్నం 1.04ని.ల‌కు బాలు తిరిగి రాని లోకాల‌కు వెళ్ళారు. ఆయ‌న మృతి సంగీత ప్ర‌పంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశ వ్యాప్తంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న మృతికి సంతాపం తెలియ‌జేస్తూ, కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు.