మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉందని బుధవారం డాక్టర్లు చెప్పారు. ప్రణబ్ ఆరోగ్యంపై పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన కూతురు.

ఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా మంది వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. ఈ పుకార్లపై ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ట ట్విటర్ వేదికగా స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు కూడా తనకు ఫోన్ చేయవద్దని.. ఆస్పత్రి నుంచి అప్‌డేట్స్ అందుకునేందుకు తన మొబైల్ ఫోన్‌కు విశ్రాంతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు షర్మిష్ట. ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజులుగా ఆయన ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉందని బుధవారం డాక్టర్లు చెప్పారు. దానికి తోడు ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలిపారు. గురువారం ఆస్పత్రి నుంచి అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల కానప్పటికీ చాలా మంది పుకార్లను ప్రచారం చేస్తున్నారు. కాగా, తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సోమవారం ట్విటర్ వేదికగా ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. తాను వేరే కారణాల వల్ల ఆస్పత్రికి వెళితే.. కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం నిర్థారణ అయ్యిందని తెలిపారు. తనను గత వారం రోజులుగా కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ పాటించి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలంటూ అన్ని పార్టీల నేతలు, అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.