హైదరాబాద్: ఒకపక్క కరోనా వైరస్ వ్యాపిస్తుంటే మరో పక్కన సూర్యుడు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. నేటి నుంచి 24 వరకు 2 తెలుగు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు పెరగనుండడంతో తెలంగాణ, ఏపీ ప్రజలు రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచి ఈ నెల 24 వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్ర తలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు కూడా ఉందని పేర్కొంది. రోజులుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సూరీడు.. నిన్న ఉగ్రరూపం ప్రదర్శించాడు. రేపటి నుంచి ఆదివారం వరకు తెలంగాణ ,ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమో దవుతాయని ఐఎండీ తెలి పింది. వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండా లని హెచ్చరించింది. ఇంట్లోనే ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ముఖ్యంగా పిల్ల లు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.