మరోసారి ట్విట్టర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆయన ఫ్యాన్స్ ను టార్గెట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. తన మార్క్ ట్వీట్లతో పవన్ అభిమానులకు చురకలంటించాడు. 'లవ్ యు మై డియర్ స్వీట్ డార్టింగ్ లవ్లీ బ్యూటీఫుల్ క్యూట్ పీకే ఫ్యాన్స్.
మీ అందరికీ నా బిగ్ హగ్' అంటూ ప్రస్తుతం సోషల్ మీడియలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటోను పోస్ట్ చేశాడు. అంతేకాదు.. పవన్ ఫ్యాన్స్ ను గొర్రెలన్న వర్మ, 'నేను మూడు జన్మల ముందే చనిపోయాను. ప్రస్తుతం ఇక్కడ బతికున్న నేను దెయ్యాన్ని, దెయ్యాలు చనిపోవు, అవెప్పుడు చావులో బతికే ఉంటాయి అంటూ ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్ల పై పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.