మా ఏ స్టూడియోస్ బ్యానర్‌పై తొలి చిత్రంగా చేసిన `రాక్షసుడు` చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ – కోనేరు సత్యనారాయణ

హైదరాబాద్ : బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియో బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం `రాక్షసుడు`. ఆగస్ట్ 2న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో కార్యక్రమంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కొనేరు సత్యనారాయణ, రమేశ్ వర్మ, అభిషేక్ నామా, మారుతి, అమలాపాల్, మల్టీడైమన్షన్ వాసు, వెంకట్, నిర్మాత భరత్ చౌదరి, శరవణన్, వినోద్ సాగర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సక్సెస్‌మీట్‌లో అమలాపాల్ మాట్లాడుతూ - ```రాక్షసుడు` సినిమా యూనిట్‌కి అభినందనలు. తమిళంలో సినిమా చాలా పెద్ద హిట్ అయ్యంది. అలాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. రమేశ్ వర్మగారికి అభినందించాలి. శ్రీనివాస్ చాలా సెటిల్డ్‌గా నటించారు. నిర్మాతలకు, ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు`` అన్నారు. 

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ - ``ఇలాంటి ఓ అద్భుతమైన రోజు కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. మా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. రమేశ్ వర్మగారికి, కొనేరు సత్యనారాయణగారికి థ్యాంక్స్. వెంకట్ చాలా కష్టపడి వర్క్ చేశాడు. అందరూ మనసు పెట్టి పనిచేశారు. అందరికీ రుణపడి ఉంటాను. విలన్‌గా నటించిన శరవణన్‌గారు ఎక్సలెంట్‌గా నటించారు. చాలా టఫ్ జాబ్ చేశారు. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. కమర్షియల్ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న సినిమా ఇది. సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్`` అన్నారు. 

రమేశ్ వర్మ మాట్లాడుతూ - ``రీమేక్స్ చేయడం చాలా కష్టం. తమిళ్‌లో సినిమా చూస్తున్నప్పుడు నాకు శ్రీనివాసే కనపడ్డాడు. తను యాక్ట్ చేసిన తర్వాత సినిమా చూస్తే నా ఆలోచనకు తనెంత న్యాయం చేశాడోననిపించింది. తమిళంలో చేసిన కొందరినీ తెలుగులో కూడా తీసుకున్నాను. మెయిన్ విలన్‌గా చేసిన శరవణన్‌.. ఆ  పాత్రను తను తప్ప మరెవరూ చేయలేరనిపించింది. అందుకే తననే నటింప చేశాను. బెల్లంకొండ సురేశ్‌గారికి, సాయిశ్రీనివాస్‌కి స్పెషల్ థ్యాంక్స్`` అన్నారు.