వరంగల్ అర్బన్ : వెయ్యి ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని మహా నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కమిషనర్ క్షేత్ర స్థాయిలో నగరంలోని 38 వ డివిజన్ లో రామారావు కాలని, జవహర్ కాలని ప్రాంతాలలో నిర్మిస్తున్న మరుగుదొడ్ల పురోగతిని పరిశీలించి సమర్ధంగా  చేయుటకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహానగర పాలక సంస్థ పరిధిలో మరుగుదొడ్ల లక్ష్యాన్ని ఈ నెల 14 నాటికి పూర్తి చేయుటకు యుద్ధప్రాతిపదికన పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లు త్వరితగతిన చేసేలా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. కమిషనర్ వెంట కుడా  బల్దియా ఎస్ఈ విద్యా సాగర్, డీఈ రవికుమార్, ఏ ఈ విజయ లక్ష్మి తదితరులు ఉన్నారు.
...