విష్ణు మంచు చాలా ప్రతిస్తతాత్మకంగా తీస్తున్న చిత్రం మోసగాళ్లు. తన కెరీర్ లో నే అత్యంత ఎక్కువ బడ్జెట్ తో నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం ఇది. దీనితో ఈ చిత్రం మీద అంచనాలు ఆకాశానికి అంటాయి. ఈ చిత్రం మార్చ్ 19 న విడుదల కానుంది. కాగా  ఈ దానికి సంబందించిన 10 నిముషాల స్నీక్ పీక్ ని చిత్ర బృందం సమక్షం లో ఈ సాయంత్రం ప్రదర్శించారు. దాని ప్రాథమిక  సమీక్షను ఇప్పుడు చూద్దాం. 

ఈ చిత్రం విష్ణు మంచు కు ఒక "కంబ్యాక్" అని చెప్పవచ్చు. అటు నటుడి గా ఇటు ప్రొడ్యూసర్ గా టాప్ మార్కులు కొట్టేసాడు.  బలమైన కథ తో మరింత ఆసక్తికరమైన  కథనం తో  ఆకట్టుకున్నాడు. 

కథ విషయానికి వస్తే.. అర్జున్ మరియు అను అక్కాతమ్ముళ్లు.  ప్రతీ విషయం లో తానై ముందుండే అక్క అను పాత్రలో కాజల్, ఆమె మాటలను జవదాటకుండా పాటించే తమ్ముడు పాత్ర లో విష్ణు మంచు నటన అకట్టుకుంది. కాజల్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. కాగా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విష్ణు మంచు గురించి. 

ఈ చిత్రంలో విష్ణు మంచు లోని కొత్త కోణాన్ని చూస్తాం. ఇప్పటిదాకా ప్రధానంగా కేవలం కామెడీ డ్రామా లకు పరిమితమైన విష్ణు మంచు ఈ చిత్రం లో చాలా  ఫ్రెష్ గా కనబటమే కాకుండా ఆ పాత్రలో ఇమిడిపోయారు. 

సునీల్ శెట్టి ఇందులో  కుమార్  అనే  పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తారు. నవదీప్, నవీన్ చంద్ర  ఇతర నటీనటులు  వారి వారి యొక్క నటనతో  వీరికి బాసట గా నిలిచారు. 

అక్కాతమ్ముళ్ల ఈ స్కాం ఎందుకు చేస్తున్నారు. వారి లక్ష్యం ఏమిటి. ఇలాంటి విషయాలు  కట్టిపడేస్తాయి. పది నిముషాల నిడివి గల స్నీక్ పీక్ లో చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అంశాల్ని ప్రదర్శించారు. మిగితా చిత్రం ఎలా ఉంటుంది అనే  ఆసక్తి పెంచే విధంగా ఉండి  ఆకట్టుకుంది.

ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.