హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అయితే మరోసారి కూడా మంత్రి ఎర్రబెల్లి కి పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చింది. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా మరోసారి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  సోమవారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో మంత్రి ఎర్రబెల్లికి కరోనా నెగటివ్ వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే కరోనా టెస్ట్ చేయించుకున్నాని తెలిపారు. ఆలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా వుంటూ మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం వుంటూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.