ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. బాలీవుడ్‌ మూవీ మాఫియా, డ్రగ్‌ రాకెట్‌ గురించి బయటపెట్టినందు వల్లే తనపై కక్షగట్టారని ఆరోపించారు. అన్నింటికీ మించి తన తనయుడు ఆదిత్య ఠాక్రే సన్నిహితులకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడం ఆయనకు పెద్ద సమస్యగా పరిణమించిందని, తాను చేసిన పెద్ద నేరం ఇదేనంటూ కంగన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు.. ‘‘ముఖ్యమంత్రి ముద్దుల తనయుడు ఆదిత్య ఠాక్రేకు వినోదం పంచే మూవీ మాఫియా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హంతకులు, డ్రగ్స్‌ రాకెట్‌ గురించి నేను బయటపెట్టడమే మహారాష్ట్ర సీఎంకు ఉన్న అసలైన సమస్య, నేను చేసిన అదిపెద్ద నేరం ఇదే. అందుకే వాళ్లు నాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు, సరే చూద్దాం.. ఎవరు ఎవరిపై పగ తీర్చుకుంటారో... అని కంగన ట్విటర్‌ వేదికగా సవాల్‌ విసిరారు.