రేపు గౌహతిలో  బాలికా విద్యపై ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్ గా సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రెండో సమావేశం• దేశ స్థాయిలో బాలిక విద్యను పెంపొందించడంపై చర్చించనున్న సబ్ కమిటీ•
 
దేశంలో బాలికల విద్య పరిస్థితులను అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారులతో కమిటీ నియామకంపై చర్చించనున్నసబ్ కమిటీ
. వివిధ రాష్ట్రాల్లో తిరిగి బాలిక విద్యపై పరిస్థితులను అధ్యయనం చేయడంపై నిర్ణయం తీసుకోనున్న రెండో సమావేశం
 
.
 
హైదరాబాద్ 30 – బాలికల విద్యపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలొ నియమించిన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రేపు (31.03.2017) సాయంత్రం గౌహతిలో రెండోసారి సమావేశం కానుంది.  ఈ రెండో సమావేశంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యాలయాల్లో బాలికల నమోదు, వారికి కల్పించే వసతులు, డ్రాపవుట్లకు గల కారణాలు, లింగ వివక్ష, సామాజిక అంశాలపై చర్చించనున్నారు. సభ్యులుగా అసోం మంత్రి హేమంత బిస్వా శర్మ, ఝార్ఖండ్ మంత్రి నీరా యాదవ్,  కేంద్ర మానవ వనరుల  మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రీనారాయ్‌ సభ్య కార్యదర్శిగా ఉన్నారు. వీరితో పాటు రెండో సమావేశానికి తెలంగాణ విద్యాశాఖ స్పెషల్ సిఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, కేంద్ర పాఠశాల విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సావిత్రి, ఎన్ సిఈఆర్టీ, ఎన్ఈయుపిఏ, ఎన్ సీటీఈ అధికారులు హాజరుకానున్నారు. 
దేశ స్థాయిలో  బాలికా విద్యను ప్రోత్సహించేందుకు, బాలిక విద్యలోని వెనుకబాటుతనానికి కారణాలు తెలుసుకోవడం, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.  బాలిక విద్యకు సరైన ప్రాధాన్యం లేకపోవడానికి వారి సామాజిక, ఆర్ధిక అంశాలు, లింగ వివక్ష వంటి ఎంతవరకు కారణాలో ఈ కమిటీ మొదటి సమావేశంలో చర్చించింది. దీనికి సంబంధించిన గణాంకాలు సేకరించేందుకు సీనియర్ అధికారులతో ఒక కమిటీ వేయాలన్న అంశంపై రెండో సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. లింగ వివక్ష వల్ల బాలికలు విద్యకు దూరం  కావడంపై కూడా లోతుగా అధ్యయనం చేసేందుకు కమిటీ ఈ రెండో సమావేశంలో చర్చించనుంది. సామాజిక అంశాలు బాలికల విద్యపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో చర్చించిన మొదటి సమావేశం...రెండో సమావేశంలో దీనికి సంబంధించి ఎలాంటి కార్యచరణ చేయాలనే దానిపై దృష్టి పెట్టనుంది ప్రస్తుతం దేశంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఎలాంటి పథకాలు, చర్యలు, ప్రోత్సాహకాలు చేపడితే బాగుంటుందో దానిని ఈ కమిటీ సూచించనుంది. 
విద్యాలయాల్లో, హాస్టళ్లలో బాలికల కోసం ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలి, టాయిలెట్స్ వసతులు ఎలా కల్పించాలనే దానిపై కూడా ఈ కమిటీ తన ప్రతిపాదనలు కేంద్రానికి ఇవ్వనుంది.