హైద‌రాబాద్‌: యూఏఈ‌లో జ‌రిగే ఐపీఎల్‌13 కోసం క్రికెట‌ర్లు స‌న్న‌ద్దం అవుతున్నారు.  చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా రెడీ అవుతున్నాడు.  అయితే బుధ‌వారం రోజున రాంచీలో ధోని కోవిడ్‌19 ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్లు తెలిసింది. మ‌రో టీమ్ స‌భ్యుడు మోనూ సింగ్ కూడా ఈ ప‌రీక్ష‌లు చేయించుకున్నాడు.  బుధ‌వారం సాయంత్రం కోవిడ్‌19 ప‌రీక్ష ఫ‌లితాలు వ‌స్తాయి.  ఒక‌వేళ కోవిడ్ ప‌రీక్ష‌లో ధోనీ నెగ‌టివ్‌గా తేలితే.. అప్పుడు అత‌ను చెన్నైకి బ‌య‌లుదేరి వెళ్తాడు. అక్క‌డ మిస్ట‌ర్ కూల్ త‌న టీమ్ స‌భ్యుల‌తో శిక్ష‌ణ‌లో పాల్గొంటాడు. చెన్నై టీమ్‌కు చెందిన ర‌వీంద్ర జ‌డేజా వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ట్రైనింగ్‌కు దూరంగా ఉన్నట్లు సీఈవో కాశి విశ్వ‌నాథ‌న్ తెలిపారు. ఆగ‌స్టు 15వ తేదీ నుచి ఆగ‌స్టు 20వ తేదీ వ‌ర‌కు ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో చెన్నై జ‌ట్టు క్యాంప్ నిర్వ‌హించ‌నున్న‌ది.