హైదరాబాద్ : అప్ప‌టివ‌ర‌కు చిన్న‌చిన్న గొడ‌వ‌లు, కొద్దిగా వినోదంతో సాగిన బిగ్ బాస్ షో..శ‌నివారం సంద‌డిగా సాగింది. హోస్ట్ నాగార్జున ఆరవ ఎపిసోడ్ ను వినోదాత్మ‌కంగా సాగించాడు. ఓ వైపు ఎంట‌ర్ టైనింగ్ చేస్తూనే..వారికి ఫ‌న్నీ టాస్క్ ఇచ్చి ఇంటిస‌భ్యుల క్యారెక్ట‌ర్ ను బ‌య‌ట‌కు తీశాడు. అయితే ఈ ఫ‌న్నీ టాస్క్ కు నేబ‌ర్ హౌజ్ నుంచి బిగ్ బాస్ ఇంట్లోకి వ‌చ్చిన సోహైల్‌, అరియానా బ‌ల‌య్యార‌నే చెప్పొచ్చు..నాగార్జున..సోహైల్, అరియానాలకు వివిధ ర‌కాల బొమ్మ‌లున్న కొన్ని మెడ‌ల్స్ ఇచ్చాడు. ఒక్కో మెడ‌ల్ ను ఎవ‌రెవ‌రికీ ఇస్తారో కార‌ణం చెప్పి వారి మెడ‌లో వేయాల‌ని సూచించాడు. మొద‌ట ఊస‌ర‌వెళ్లి అని రాసి ఉన్న మెడ‌ల్ ను దీంతో సోహైల్‌, అరియానా.. సుజాత‌కు ఇచ్చారు. అప్ప‌డే ఏడుస్తుంది..అప్పుడే న‌వ్వుతుంది..వెంట‌నే బాధ‌ప‌డుతుంది అందుకే ఈ మెడ‌ల్ ను సుజాత‌కు ఇచ్చామ‌ని వారిద్ద‌రు చెప్పారు. ఆ త‌ర్వాత కాక‌ర‌కాయ (చేదు)మెడ‌ల్ ను అఖిల్ ఇచ్చారు. అఖిల్ చాలా మంచోడ‌ని, జాగ్ర‌త్త కూడా ఎక్కువేన‌ని, అందుకే అఖిలంటే ఇష్ట‌మ‌ని అరియానా చెప్పింది. దీంతో నాగార్జున అరియానా గ్లోరికి అన్నం తినిపించాల‌ని అఖిల్ కు చెప్పాడు.

అనంత‌రం ఇంట్లో చిచ్చు పెట్టేది ఎవ‌ర‌ని అడుగ‌గా..ఆ ఇద్ద‌రూ క‌ళ్యాణి పేరు చెప్పుకొచ్చారు. క‌ళ్యాణి ఇక్క‌డి మాట‌లు అక్క‌డ‌..అక్క‌డి మాట‌లు ఇక్క‌డ చెప్తార‌ని..అందుకే ఆమెకు పుల్ల‌లు పెట్టే మెడ‌ల్ ఇస్తున్నామ‌ని సోహైల్ వెల్ల‌డించాడు. మ‌రోవైపు హారిక‌కు డ్రామా క్వీన్ ను మెడ‌ల్ ను సోహైల్ వేయ‌గా..షాక‌వ్వ‌డం నాగ్ వంతైంది. డ్రామా క్వీన్ మెడ‌ల్ హారిక‌కు సెట్ అవ్వ‌ద‌ని నాగార్జున చెప్పాడు. ఇంట్లో సూర్య‌కిర‌ణ్ ఏ పని చేయ‌రంటూ..ఆయ‌న‌కు బ‌ద్ద‌కం మెడ‌ల్ వేశారు.


ఇక చెత్త‌కుండి మెడ‌ల్ ను ఎవ‌ర‌కిస్తార‌ని నాగార్జున అడుగ‌గా..ఈ మెడ‌ల్ వేయించుకునేవారు బిగ్ హౌజ్ లో ఎవ‌రూ లేర‌ని..అందుకే ఆ మెడ‌ల్ ఇవ్వ‌లేన‌ని సోహైల్ చెప్పుకొచ్చాడు. అయితే సోహైల్ అలా చెప్ప‌గానే అరియానా ముందుకొచ్చి..చెత్త‌కుండి మెడ‌ల్ ను అభిజిత్ కు ఇచ్చింది. త‌న‌కు ఎవ‌రైనా అన్నం తినిపించాల‌ని నేను అడిగిన‌పుడు అభిజిత్‌..తాను ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తున్నాన‌ని అన్నాడు. అందుకే అభిజిత్ కు చెత్త‌కుండి మెడ‌ల్ ఇస్తాన‌ని చెప్పింది. తోపు మెడ‌ల్ ను సోహైల్‌, అరియానా ..గంగ‌వ్వ‌కు ఇచ్చేశారు. బిగ్ బాస్ లో గంగ‌వ్వ‌కు మించిన తోపెవ‌రూ లేర‌ని, గంగ‌వ్వ ఎన్నో క‌ష్టాలు చూసి ఇక్క‌డకొచ్చి ఈ స్థాయికి చేరుకున్న గంగ‌వ్వ‌కు ఈ మెడ‌ల్ ఇస్తున్న‌ట్టు చెప్పారు. మ‌రోవైపు  నాగ్ కూడా బిగ్ బాస్ హౌజ్ లో గంగ‌వ్వే అంద‌రికంటే తోపు అని చెప్ప‌డం విశేషం. 

 

అభిజిత్‌, సుజాత సేఫ్ జోన్ లోకి..
ఆ త‌ర్వాత ఎలిమినేష‌న్ జోన్ లో ఉన్న ఏడుగురిలో నాగార్జున‌..మొద‌ట అభిజిత్ ను ఆ త‌ర్వాత సుజాత, గంగ‌వ్వ‌ను కాపాడారు. బిగ్ బాస్ హౌజ్ లో మెజారిటీ ఇంటి స‌భ్యులు లాస్య‌ను క‌ట్ట‌ప్ప అనుకున్నారు..కానీ హౌజ్ లో అలాంటి క్యారెక్ట‌రే లేద‌ని చెప్పిన నాగార్జున‌..లాస్య‌ను ఫ‌స్ట్ కెప్టెన్ గా ప్ర‌క‌టించారు.