హైద‌రాబాద్‌: దైవ భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమేనంటున్నారు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు. రానున్న వినాయక నవరాత్రుల్లో మట్టి వినాయకున్నే పూజించాలని విజ్ఞప్తి చేశారు. క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ అనే నినాదంతో ప్రతీ ఒక్కరూ కంకణబద్ధులై వినాయక నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని రాఘవేంద్రరావు వినాయకుని భక్తులకు సూచించారు.