ఎర్రచందనం అక్రమ కేసులో అరెస్టైన గగన సఖి రాణి సంగీత చటర్జీ (26) ని పాకాల జూనియర్ సివిల్ జడ్జి ముందు చిత్తూరు పోలీసులు  హజరుపచారు.  చిత్తూరు నుంచి బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆమెను ప్రత్యేక వాహనంలో పట్టిష్ట బందోబస్తు నడుమ పాకాల కు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను పాకాల జూనియర్ సివిల్ జడ్జి దేవేంద్రరెడ్డి  ముందు హజరుపరచారు.  ఆమెకు 14 రోజులు రిమాండ్ విదించారు. అక్కడి నుంచి ఆమెను పోలీసులు చిత్తూరు  జైలుకు తరలించారు. 
ఈమెను పాకాలకు తరలిస్తున్నరని తెలిసి పాకాల సీఐ రామలింగమయ్య ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఎర్రచందనం కేసులో ఈమె, ఈమె భర్త లక్ష్మన్ తో పాటు ముందాయిగా ఉంది. కల్లూరు పోలీస్ స్టేషన్ లో, చిత్తూరు  జిల్లా లోని మరికొన్ని పోలీస్ స్టేషన్ లో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఈమెపై  నమోదు చేశారు ఆ కేసుల్లో చిత్తూరు పోలీసులు ముద్దాయి గా జడ్జీ ముందు ప్రవేశపెట్టారు. 
ఉగాది పండుగ సందర్భంగా కోర్టు సెలవు కావడంతో జడ్జి ఇంటి ముందు ఆమెను హజరు పరిచారు. ఈ వుషయం తెలుకున్న మిడియా ప్రతినిదులు పెద్దసంఖ్యలో వచ్చారు.   పాకాల ప్రజలు ఆమెను  చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు.