తెలంగాణలో తాజా కొవిడ్ పాజిటివ్ కేసుల వివరాలు
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 2,043 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,67,046కి చేరింది. కొత్తగా 1802 మంది వైరస్ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 1,35,357 మంది ఇండ్లకు చేరుకున్నారు. తాజాగా మరో 11 మంది మృతి చెందగా, మొత్తం 1,016 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,673 యాక్టివ్ కేసులున్నాయని, మరో 24,081 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది. కాగా, రాష్ట్రంలో 0.60శాతం మరణాలు రేటు ఉండగా, రికవరీ రేటు 81.02శాతంగా ఉందని పేర్కొంది. నిన్న ఒకే రోజు 50,634 శాంపిల్స్ పరీక్షించగా, 1039 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, ఇప్పటికీ మొత్తం 23,79,950 టెస్టులు చేసినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీలో 314 నిర్ధారణ అయ్యాయి. తర్వాత రంగారెడ్డి 174, మేడ్చల్ మల్కాజ్గిరి 144, నల్గొండ 131, సిద్దిపేటలో 121, కరీంనగర్ 114, వరంగల్ అర్బన్ జిల్లాలో 108 పాజిటివ్ కేసులు రిక్డారయ్యాయని వివరించింది.