హైద‌రాబాద్: ఈ నెలాఖ‌రు నుండి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌నున్న‌ బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మానికి సంబంధించి ఒక్కొక్క‌టిగా ప్రోమోలు బయటకు వ‌స్తున్నాయి. తాజాగా అక్కినేని నాగార్జున లుక్‌కి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఇందులో ఆయ‌న ముస‌లి వ్య‌క్తిలా క‌నిపించి అందరికి షాక్ ఇచ్చారు. అంతేకాదు గోపి అంటూ చిన్న న‌వ్వు న‌వ్వారు. దీంతో బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌లో అనేక అనుమానాలు మొద‌ల‌య్యాయి. సీజన్‌ 3లో నాగార్జున పండు అంటూ ఒక కోతి బొమ్మను వేలుకు పెట్టుకొని దానితో అనేక విష‌యాలు షేర్ చేస్తూ ఉండేవారు. ఈ సారి గోపి అంటూ మ‌రెవ‌రిని ప‌ట్టుకొస్తారా అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఇదిలా ఉంటే సీజ‌న్‌3లో టిప్ టాప్‌గా రెడీ అయి వ‌చ్చిన నాగార్జున ఈ సారి ముస‌లి గెట‌ప్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడేంట్రా అని నెటిజ‌న్స్ చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విష‌యాల‌కి పూర్తి క్లారిటీ రావాలంటే మ‌రి కొద్ది రోజులు ఆగ‌క త‌ప్ప‌దు మ‌రి. ఇదిలావుంంటే  ముస‌లి వ్య‌క్తిలా ఉన్న నాగార్జున లుక్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.