న్యూఢిల్లీ: సౌత్‌కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్‌పై రూ.2వేలు తగ్గించింది. ఏప్రిల్‌లో ఫోన్లపై జీఎస్టీ రేటు 12శాతం నుంచి 18శాతానికి పెరగడంతో  6జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర పెరిగింది. ఈ మోడల్‌తో  పాటు  8జీబీ ర్యామ్‌ మోడల్‌ ధరను  కంపెనీ మళ్లీ తగ్గించింది.  దీంతో పాటు హెచ్‌ఎస్‌బీసీ, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసినవారు రూ.1500 క్యాష్‌బ్యాక్‌ పొందనున్నారు. యూజర్లు  స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభ ధర రూ.22,499లకే కొనుగోలు చేయొచ్చు.  గెలాక్సీ ఎ 51 స్మార్ట్‌ఫోన్‌  6జీబీ  ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను  ఇప్పుడు రూ.23,999  కొనుగోలు చేయవచ్చు. అలాగే,  8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ మోడల్‌  కొత్త ధర ఇప్పుడు రూ .25,999గా ఉన్నది.