• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

సింధుకు బర్త్ డే విషెష్ తెలిపిన క్రికెటర్లు

న్యూ ఢిల్లీ: భారత్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌, బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సింధు ఈ రోజు తన 25వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తాయి. ‘హ్యాపీ బర్త్‌డే పీవీ సింధు. మీరు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. దేశానికి మరిన్ని పురస్కారాలు తీసుకురావాలి.’ అంటూ యువరాజ్‌ ట్వీట్‌ చేశాడు

Related News