• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

నాగ్‌పూర్ రెండో వన్డేలో విరాట్ సెంచరీ

నాగ్‌పూర్ రెండో వన్డేలో విరాట్ సెంచరీ 

నాగ్‌పూర్: వన్డేల్లో విరాట్ కోహ్లి సెంచరీల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ లో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ మరో సెంచరీ చేశాడు. ఈ ఫార్మాట్‌లో కోహ్లికిది 40వ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఓవైపు సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా.. ఒంటరి పోరాటం చేసిన కోహ్లి.. భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. విజయ్ శంకర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించాడు. జ‌డేజాతో క‌లిసి ఏడో వికెట్‌కు 67 ప‌రుగులు జోడించాడు. దీంతో టీమిండియా 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. కోహ్లి కాకుండా విజయ్ శంకర్ ఒక్కడే 46 పరుగులతో పర్వాలేదనిపించాడు. ధావన్, జడేజా చెరొక 21 పరుగులు చేశారు. రోహిత్ (0), ధోనీ (0), జాదవ్ (11), రాయుడు (18) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 4, జంపా రెండు వికెట్లు తీసుకున్నారు.
 

Related News