• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

జమ్మూకశ్మీర్‌ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాన్‌పోరా వద్ద నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ముష్కరులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఘటనాస్థలి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు జమ్మూకశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, పోలీసు బలగాలు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. 
 

Related News

మణిపూర్‌లో ఉగ్రదాడులు.. నలుగురు జవాన్లు మృతి

మణిపూర్‌లో ఉగ్రదాడులు.. నలుగురు జవాన్లు మృతి

మణిపూర్‌లో ఉగ్రదాడులు మెరుపు దాడి చేశారు. అస్సాం రైఫిల్స్‌ యూనిట్‌కు చెందిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. అంతేకాకుండా జవాన్లపై కాల్పులకు కూడా దిగారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా
కాల్పుల్లో ఇద్ద‌రు పాక్ ఉగ్ర‌వాదులు హతం

కాల్పుల్లో ఇద్ద‌రు పాక్ ఉగ్ర‌వాదులు హతం

స‌రిహ‌ద్దుల్లో నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద అక్ర‌మంగా చొర‌బ‌డేంద‌కు ప్ర‌య‌త్నించిన పాక్ ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు తిప్పికొట్టాయి. జ‌మ్మ‌క‌శ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లోని నియంత్ర‌ణ రేఖ స‌మీపంలో మంగ‌ళ‌వారం రాత్రి  పాకిస్థానీ ఉగ్ర‌వాదులు
ఉదయం కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఉదయం కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఉగ్రవాదులకు నిలయంగా మారిన జమ్ముకశ్మీర్‌లో టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా ఖుల్‌చోహార్‌