• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఇవాంకా కు గట్టి భద్రతా

ఢిల్లీ : జీఈఎస్ సదస్సు కోసం  హైదరాబాద్ కు వచ్చిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ లక్ష్యంగా దాడి చేయడానికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కుట్రపన్నుతారని నిఘా వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి అమెరికా సీక్రెట్ సర్వీస్, భారత నిఘా వర్గాలకు హెచ్చరించడంతో  ఆమెకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సదస్సు భద్రత కోసం  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10,400 మంది  పోలీసులను మోహరించింది.  అమెరికా  నుంచి 8 మంది సీక్రెట్ అధికారులు అనుక్షణం ఇవాంక చుట్టు  రక్షణ కల్పిస్తున్నారు. తెలంగాణకు చెందిన 200 మంది అనుమానితుల  కదలికలను నిఘా వర్గాలు గమనిస్తున్నాయి. ఇవాంక కోసం ఇజ్రాయిల్ నుంచి తెప్పించిన విధ్వంసక వ్యతిరేక, యాంటీ ఎక్స్ ప్లోజిన్ ప్రత్యేక పరికరాలను హెచ్ఐసీసీ. ఫలక్ నుమా,  ట్రైండెంట్ హోటల్ వద్ద ఉంచారు. పరిసర ప్రాంతాల్లో నిఘా వర్గాలు డేగకళ్లతో కాపలా కాస్తున్నాయి.

Related News

మణిపూర్‌లో ఉగ్రదాడులు.. నలుగురు జవాన్లు మృతి

మణిపూర్‌లో ఉగ్రదాడులు.. నలుగురు జవాన్లు మృతి

మణిపూర్‌లో ఉగ్రదాడులు మెరుపు దాడి చేశారు. అస్సాం రైఫిల్స్‌ యూనిట్‌కు చెందిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. అంతేకాకుండా జవాన్లపై కాల్పులకు కూడా దిగారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా
కాల్పుల్లో ఇద్ద‌రు పాక్ ఉగ్ర‌వాదులు హతం

కాల్పుల్లో ఇద్ద‌రు పాక్ ఉగ్ర‌వాదులు హతం

స‌రిహ‌ద్దుల్లో నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద అక్ర‌మంగా చొర‌బ‌డేంద‌కు ప్ర‌య‌త్నించిన పాక్ ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు తిప్పికొట్టాయి. జ‌మ్మ‌క‌శ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లోని నియంత్ర‌ణ రేఖ స‌మీపంలో మంగ‌ళ‌వారం రాత్రి  పాకిస్థానీ ఉగ్ర‌వాదులు
ఉదయం కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఉదయం కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఉగ్రవాదులకు నిలయంగా మారిన జమ్ముకశ్మీర్‌లో టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా ఖుల్‌చోహార్‌
జమ్మూకశ్మీర్‌ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాన్‌పోరా వద్ద నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ముష్కరులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.