• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

టీమిండియా చీఫ్‌ కోచ్‌ పదవికి గట్టి పోటి

న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్‌ కోచ్‌ పదవి కోసం క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) కసరత్తు పూర్తి చేసింది. ఎంతో మంది దరఖాస్తు చేసుకోగా ఆరుగురితో తుది జాబితాను సిద్ధం చేసింది. ఇందులో ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు మైక్‌ హెసెన్‌ (న్యూజిలాండ్‌), టామ్‌ మూడీ (ఆస్ట్రేలియా), ఫిల్‌ సిమన్స్‌ (విండీస్‌), లాల్‌చంద్‌ రాజ్‌పుత్, రాబిన్‌సింగ్‌ (భారత్‌) ఉన్నారు. త్వరలోనే వీరికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం కోహ్లి అండదండలున్న రవిశాస్త్రికే మళ్లీ కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరోపక్క, టామ్‌ మూడీ, మైక్‌ హెస్సెన్‌ల నుంచి రవిశాస్త్రికి గట్టి పోటీ ఉండోచ్చు. అలా కాకుండా కోహ్లి మాటనే పరిగణలోకి తీసుకుంటే మాత్రం ప్రధాన కోచ్‌ పదవిలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా రవిశాస్త్రి, సపోర్టింగ్‌ స్టాఫ్‌ల పదవీ కాలాన్ని 45 రోజులు పొడిగించిన సంగతి అందరికి తెలిసిందే.

Related News