• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న ధోని


ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లోనూ టీమిండియా మాజీ కెప్టెన్‌, బ్యాట్స్‌మన్‌ కమ్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోని నిర్భయంగా తన విధులు కొనసాగిస్తున్నారు. సాధారణ సైనికుల మాదిరిగానే బ్యారక్‌ల్లో ఉంటూ గస్తీ విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి సాధారణ సైనికులతోపాటే అన్ని విధుల్లో పాల్గొంటూ ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం 106 టీఏ పారా బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న ధోనీ ఆగస్టు 15 వరకు అందులో కొనసాగుతారు.

ఈలోగా గ్రామాల్లో పెట్రోలింగ్‌ కూడా నిర్వహించే అవకాశం ఉంది. కానీ ఇక్కడే చిక్కుంది. కశ్మీర్‌ అడవుల్లో అక్కడక్కడా విసిరేసినట్లుండే గ్రామాల్లో ఉగ్రవాదులు తోడేళ్లలా నక్కిఉంటారు. భారీ కాన్వాయ్‌తో వెళ్లే సైనికులపై దాడులు చేసిన సందర్భాలు ఎన్నో. ఇవన్నీ ధోనికి సవాల్‌ విసిరే అంశాలే. కానీ రేపు బతుకుతామో? లేదో? తెలియని పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు తానూ అదే పరిస్థితులు ఎదుర్కొంటూ ధోనీ ఇస్తున్న స్ఫూర్తి ఎంతో ఉపయుక్తమంటే అతిశయోక్తి కాదు.

Related News

ఆసీస్, వెస్టిండీస్‌ మధ్య టీ20 సిరీస్‌ వాయిదా

ఆసీస్, వెస్టిండీస్‌ మధ్య టీ20 సిరీస్‌ వాయిదా

ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ మధ్య అక్టోబర్‌లో జరుగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ వాయిదా పడింది. పొట్టి ప్రపంచకప్‌నకు ముందు సన్నాహకంగా నిర్వహించాలనుకున్న ఈ సిరీస్‌ను వాయిదా వేసినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా మంగళవారం స్పష్టంచేసింది. దీనికి వెస్టిండీస్‌