• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీపై నిషేధం


అసున్‌కియాన్: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీపై మూడు నెలల నిషేధం పడింది. నిబంధనలను విరుద్దంగా దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్యపై అవినీతి ఆరోపణలు చేయడమే ఈ బ్యాన్‌కు ప్రధాన కారణం. నిషేధంతో పాటు సమాఖ్య అతడికి 50 వేల డాలర్లు (రూ. 34.85 లక్షలు) జరిమానా కూడా విదించింది. గత నెలలో బ్రెజిల్ వేదికగా జరిగిన కోపా అమెరికా కప్ సెమీఫైనల్లో అర్జెంటీనా 0-2తో ఓటమి పాలైంది. అనంతరం మూడో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1తో చిలీని ఓడించింది. ఈ సందర్భంగా మెస్సీ దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ కార్యవర్గంపై అవినీతి ఆరోపణలు చేశాడు. బ్రెజిల్‌ను గెలిపించేందుకు ఈ టోర్నీలో అవినీతి జరిగిందిని 32 ఏండ్ల మెస్సీ పేర్కొన్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సమాఖ్య క్రమశిక్షణ చర్యల్లో భాగంగా లియోనల్ మెస్సీపై వేటు వేసింది.
 

Related News

ఆసీస్, వెస్టిండీస్‌ మధ్య టీ20 సిరీస్‌ వాయిదా

ఆసీస్, వెస్టిండీస్‌ మధ్య టీ20 సిరీస్‌ వాయిదా

ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ మధ్య అక్టోబర్‌లో జరుగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ వాయిదా పడింది. పొట్టి ప్రపంచకప్‌నకు ముందు సన్నాహకంగా నిర్వహించాలనుకున్న ఈ సిరీస్‌ను వాయిదా వేసినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా మంగళవారం స్పష్టంచేసింది. దీనికి వెస్టిండీస్‌