• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

మణిపూర్‌లో ఉగ్రదాడులు.. నలుగురు జవాన్లు మృతి

చందేల్ జిల్లా : మణిపూర్‌లో ఉగ్రదాడులు మెరుపు దాడి చేశారు. అస్సాం రైఫిల్స్‌ యూనిట్‌కు చెందిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. అంతేకాకుండా జవాన్లపై కాల్పులకు కూడా దిగారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన రాజధాని ఇంఫాల్ నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందేల్ జిల్లాలో జరిగింది. చందేల్ జిల్లాలోని పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన స్థానిక ఉగ్ర‌వాదులు దాడికి పాల్ప‌డి ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. తొలుత ఉగ్ర‌వాదులు ఐఈడీ పేలుడుకు పాల్ప‌డ్డారు. ఆ త‌ర్వాత వారు జ‌వాన్ల‌పై కాల్పులు జ‌రిపారు. దాడి ఘ‌ట‌న తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతానికి ప్ర‌త్యేక ద‌ళాల‌ను పంపించారు.

Related News

కాల్పుల్లో ఇద్ద‌రు పాక్ ఉగ్ర‌వాదులు హతం

కాల్పుల్లో ఇద్ద‌రు పాక్ ఉగ్ర‌వాదులు హతం

స‌రిహ‌ద్దుల్లో నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద అక్ర‌మంగా చొర‌బ‌డేంద‌కు ప్ర‌య‌త్నించిన పాక్ ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు తిప్పికొట్టాయి. జ‌మ్మ‌క‌శ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లోని నియంత్ర‌ణ రేఖ స‌మీపంలో మంగ‌ళ‌వారం రాత్రి  పాకిస్థానీ ఉగ్ర‌వాదులు
ఉదయం కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఉదయం కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఉగ్రవాదులకు నిలయంగా మారిన జమ్ముకశ్మీర్‌లో టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా ఖుల్‌చోహార్‌
జమ్మూకశ్మీర్‌ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాన్‌పోరా వద్ద నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ముష్కరులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.