• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఆర్మీ క్యాప్‌లు విషయంలో పీసీబీకి పంచ్ పడింది

ఆర్మీ క్యాప్‌లు విషయంలో పీసీబీకి పంచ్ పడింది

న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు తమ అనుమతి తీసుకునే ఆర్మీ క్యాప్‌లు ధరించారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సోమవారం స్పష్టతనిచ్చింది. మ్యాచ్‌లో ఆటగాళ్లు ఆర్మీ క్యాప్‌లు ధరించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తప్పుబట్టింది. క్యాప్‌లు పెట్టుకుని మ్యాచ్ ఆడిన భారత క్రికెటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐసీసీకి పీసీబీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై ఐసీసీ స్పందిస్తూ ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంలో భాగంగా జాతీయ భద్రతా నిధికి విరాళమిచ్చేందుకు భారత క్రికెటర్లు ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఆర్మీ క్యాప్‌లు ధరించారు. దీని కోసం బీసీసీఐ మా నుంచి అనుమతి తీసుకుందని ఐసీసీ జనరల్ మేనేజర్ క్లారీ ఫర్లోంగ్ పేర్కొన్నాడు. 
 

Related News