• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌ భారీ విజయం

మాంచెస్టర్‌ : నాలుగు నెలల కరోనా విరామం తర్వాత జరిగిన క్రికెట్‌లో శుభారంభం అదిరింది. ఇంగ్లండ్‌- వెస్టిండీస్‌ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో ఆతిథ్య జట్టు 2-1 తేడాతో విజ్డెన్‌ ట్రోపీని సొంతం చేసుకుంది. కాగా ఇరు దేశాల మధ్య జరిగే సిరీస్‌లో విజేతగా నిలిచిన జట్టుకు విజ్డెన్‌ ట్రోపీని అందించడం ఆనవాయితీగా వస్తుంది. మూడో టెస్టులో భాగంగా 390 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన విండీస్‌ జట్టు 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో 269 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ జట్టు భారీ విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 5 వికెట్లతో రాణించగా, బ్రాడ్‌ మరోసారి 4 వికెట్లతో రాణించాడు.

Related News