• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

డేంజ‌ర్ బెల్స్..క‌మ్యూనిటీ స్ప్రేడ్‌లోకి క‌రోనా

హైదరాబాద్: తెలంగాణ‌లో క‌రోనావైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి స్టేజ్ 3కి చేరుకుంద‌ని, క‌మ్యూనిటీ స్ప్రేడ్ అవుతుంద‌ని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌ కోఠిలోని కరోనా కంట్రోల్‌ సెంటర్‌లో వైద్య విద్యా డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఇక‌, రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లో కూడా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయ‌న్న శ్రీ‌నివాస‌రావు.. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం అన్నారు. ల‌క్ష‌ణాలు లేనివారు క‌రోనా టెస్ట్‌ల కోసం రావొద్ద‌ని.. ల‌క్ష‌ణాలున్న ప్ర‌తీ ఒక్క‌రూ టెస్ట్‌లు చేయించుకోవాల‌ని.. జిల్లాల్లో సైతం పీహెచ్‌సీల్లో క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని.. క‌రోనా ల‌క్ష‌ణాలున్నవారు ఆల‌స్యం చేస్తే ప్రాణానికే ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రించారు శ్రీ‌నివాస‌రావు. 
కరోనా విషయంలో వీలైనంత త్వ‌ర‌గా చికిత్స అందిస్తే.. ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు అని వెల్ల‌డించారు శ్రీ‌నివాస‌రావు.. క‌రోనాబారిన ప‌డినా తక్కువ మందులతో క్యూర్ అవుతార‌ని.. కరోనా ట్రీట్‌మెంట్‌కు లక్షల రూపాయల వైద్యం అవసరం లేద‌న్నారు. ఇక‌, కరోనా నియంత్రణకు తెలంగాణ రాష్ట్రం రూ.100 కోట్లు కేటాయించింద‌న్న హెల్త్ డైరెక్టర్.. వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామ‌ని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ప‌రిస్థితులు చాలా బెటర్‌గా ఉన్నాయ‌ని.. కరోనాబారిన‌ప‌డిన‌వాళ్ల‌లో 99 శాతానికి పైగా రికవరీ అవుతున్నార‌ని వెల్ల‌డించారు. ఇక‌, 70 శాతం మంది క‌రోనా రోగులు హోం ఐసోలేష‌న్‌లోనే ఉన్నార‌ని.. ప్రతీ రోజూ 15 వేల టెస్టులు తెలంగాణలో జరుగుతున్నాయి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8399ప్రభుత్వ  ఉన్నాయ‌న్న శ్రీ‌నివాస‌రావు.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వెళ్లి, ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌ద్ద‌ని కీల‌క సూచ‌న‌లు చేశారు. కేసుల సంఖ్య పెరగటంతో పాటు.. రిక‌వ‌రీ అయ్యేవారి సంఖ్య కూడా పెరిగింద‌ని.. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Related News

తెలంగాణలో కొత్తగా 1,982 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 1,982 పాజిటివ్‌ కేసులు

లంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,982 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 12 మంది మరణించారు.
దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతున్న‌ది

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతున్న‌ది

దేశంలో గ‌త మూడు రోజులుగా ప్ర‌తిరోజూ అర ల‌క్ష‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా 54 వేలకుపైగా మందికి క‌రోనా సోకింది. భారీగా పాజిటివ్‌ కేసులు వస్తుండ‌టంతో నాలుగు రోజుల్లోనే రెండు ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో
ఇండియాలో ఒక్కరోజే 52,123 కరోనా పాజిటివ్ కేసులు

ఇండియాలో ఒక్కరోజే 52,123 కరోనా పాజిటివ్ కేసులు

ఇండియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు బారీగా పెరుగుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 52,123 మందికి కరోనా పాజిటివ్‌గా
దేశ‌వ్యాప్తంగా 47,704 పాజిటివ్ కేసులు

దేశ‌వ్యాప్తంగా 47,704 పాజిటివ్ కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 47,704 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  ఒక్క రోజే దేశ‌వ్యాప్తంగా 654 మంది మ‌ర‌ణించారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,83,157కు
భారత్ లోొ ఈరోజు 45వేల పాజ‌టివ్ కేసులు

భారత్ లోొ ఈరోజు 45వేల పాజ‌టివ్ కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ స్వైర‌విహారం చేస్తున్న‌ది. గ‌త వారం రోజులుగా 32 వేల‌కు పైగా పాజ‌టివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న 37 వేల‌కుపైచిలుకు క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు రికార్డు స్థాయిలో 45 వేల‌కుపైగా మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో
తెలంగాణలో 1,850 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో 1,850 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో శనివారం 1,850 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్ ‌మున్సిపల్‌కార్పొరేషన్‌ పరిధిలోనే 1,572 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22,312 కరోనా పాజిటివ్
రాష్ట్రంలో కొత్తగా మరో 1087 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా మరో 1087 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా మరో 1087 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలోనే 888 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య ఇప్పటి వరకు 13,436కు చేరుకుంది. ఈ రోజు
ఈ రోజు దేశంలోని కరోనా అప్ డేట్స్

ఈ రోజు దేశంలోని కరోనా అప్ డేట్స్

భారత్ లో రోజోరోజుకు వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు,మరణాల వివరాలు. దేశవ్యాప్తంగా 4,90,401 కేసులు,15,301 మంది మృతి. దేశ వ్యాప్తంగా 1,89,463 యాక్టీవ్ కేసులు, 2,85,637 మంది డిశ్చార్జ్.
రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 31 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 31 పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,163కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో ఇవాళ ఒకరు