• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

సురేశ్ రైనాకు శస్త్ర చికిత్స


అమస్టర్‌డ్యామ్: టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనాకు శస్త్ర చికిత్స జరిగింది. కొన్ని నెలలుగా మోకాలి సమస్యతో బాధపడుతున్న రైనా అమస్టర్‌డ్యామ్‌లో మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. 32ఏండ్ల రైనా గత సీజన్ నుంచి మోకాలి నొప్పితో ఇబ్బందిపడుతున్నాడు. శాశ్వత పరిష్కారం కోసం వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. శస్త్రచికిత్స విజయవంతమైందని కోలుకునేందుకు 4-6 వారాల సమయం పడుతుందని రైనాకు ఆపరేషన్ చేసిన వైద్యులు వెల్లడించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రైనా భారత్ తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో 2018 జులైలో జరిగిన వన్డే మ్యాచ్‌లో చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 
 

Related News