• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ల‌క్ష చేరువ‌లో క‌రోనా మృతుల సంఖ్య


హైద‌రాబాద్: నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 95,718కి చేరుకున్న‌ది. ఆ వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 16 లక్ష‌లు దాటిన‌ట్లు అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ పేర్కొన్న‌ది. ఇక ఈ వైర‌స్ వ‌ల్ల ఇండియాలో మృతిచెందిన వారి సంఖ్య 199గా ఉంది.  భార‌త్‌లో వైర‌స్ సంక్ర‌మించిన వారు 6వేలు దాటారు. అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 1364 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఇక అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16వేలు దాటింది. మ‌హ‌మ్మారి క‌రోనా ఆ దేశంలో సుమారు 4.6 ల‌క్ష‌ల మందికి సోకింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మైంది. కేవ‌లం మూడు వారాల్లోనే సుమారు కోటిన్న‌ర మంది ఉద్యోగాలు కోల్పోయారు. వైర‌స్ వ‌ల్ల ఇట‌లీలో  18,279 మంది, స్పెయిన్‌లో 15,447 మంది,  ఫ్రాన్స్‌లో 12,210 మంది,  బ్రిట‌న్‌లో 7,978 మంది మ‌ర‌ణించారు. చైనాలో కొత్త‌గా క‌రోనా వైర‌స్ కేసులు 42 న‌మోదు అయ్యాయి.  దాంట్లో విదేశాల నుంచి వ‌చ్చిన వారి సంఖ్య 38గా ఉంది. ఆ దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81 వేలు దాటింది.

అత్య‌ధిక పాజిటివ్ కేసులు న‌మోదు అయిన దేశాల్లో అమెరికా (465,329), స్పెయిన్‌ (153,222), ఇట‌లీ (143,626), ఫ్రాన్స్‌ (118,783), జ‌ర్మ‌నీ (118,235), చైనా (82,885), ఇరాన్ (66,220), బ్రిట‌న్ (65,872) ఉన్నాయి. అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ నుంచి కోలుకున్న‌వారి సంఖ్య మూడున్న‌ర ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ది.


 

Related News

భారత్ లోొ ఈరోజు 45వేల పాజ‌టివ్ కేసులు

భారత్ లోొ ఈరోజు 45వేల పాజ‌టివ్ కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ స్వైర‌విహారం చేస్తున్న‌ది. గ‌త వారం రోజులుగా 32 వేల‌కు పైగా పాజ‌టివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న 37 వేల‌కుపైచిలుకు క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు రికార్డు స్థాయిలో 45 వేల‌కుపైగా మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో
ఆంధ్రప్రదేశ్ కరోనా సమాచారం

ఆంధ్రప్రదేశ్ కరోనా సమాచారం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ఓకేరోజులో 4వేలు పైన కేసులతో రికార్డ్ స్థాయిలో కొనసాగుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న మరణాలు. ఒకేరోజు 54 మంది చనిపోవడం అనేది ఆందోళన కలగజేసే విషయం. గడచిన 24 గంటల్లో 33,580 మంది నమూనాలు పరీక్షించగా
వరంగల్ లో తొలి కరోనా మరణం నమోదు

వరంగల్ లో తొలి కరోనా మరణం నమోదు

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను తెలంగాణ సర్కారు కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
దేశంలో క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది

దేశంలో క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది

దేశంలో క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది.  రోజు రోజుకూ కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్న సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  వ‌రుస‌గా రెండ‌వ రోజు కూడా పాజిటివ్ కేసులు ఏడు వేలు దాటాయి.  గ‌త 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా కొత్త‌గా 7964 పాజిటివ్ కేసులు
తెలంగాణలో  కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు

ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1813 కు చేరింది. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 33 జీహెచ్‌ఎమ్‌సీలోనే నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 19 నమోదయ్యాయి. ఈ రోజు కరోనా పాజిటివ్‌ వచ్చి చికిత్స తీసుకుని తిరిగి కరోనా నెగెటివ్‌ వచ్చి డిశ్చార్జ్‌ అయిన వారు
కరోనా కేసులు సంఖ్య తెలుస్తే షాక్ అవుతారు

కరోనా కేసులు సంఖ్య తెలుస్తే షాక్ అవుతారు

కరోనా మహమ్మారి 213 దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50,84,932కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 27 లక్షల 33 వేల 400. వ్యాధి నుంచి 20 లక్షల 21 వేల 813 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయి వెళ్లారు. కాగా
ప్రపంచ వ్యాప్తంగా కరోనా అప్ డేట్స్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా అప్ డేట్స్

ప్రపంచ దేశాలను వణికిస్తున్నది కరోనా వైరస్‌. ఈ మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 46,28,821 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటివరకు 3,08,654 మంది బాధితులు మృతిచెందారు. అన్ని దేశాల్లో కలిపి 17,59,702 బాధితులు కోలుకున్నారు. మరో 25,60,465 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
భారత్‌లో కరోనా విలయతాండవం

భారత్‌లో కరోనా విలయతాండవం

భారత్‌లో కరోనా వైరస్‌ విలయతాండవ చేస్తోంది. రోజురోజుకు కరోణా మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 100 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 3,967 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య
కోరోనా వైరస్ పూర్తి అప్ డేట్స్

కోరోనా వైరస్ పూర్తి అప్ డేట్స్

రెండు లక్షల 92 వేల మంది మరణించారు. అయితే 16 లక్షల రెండువేల 155 మంది వ్యాధి భారిన పడినా కోలుకున్నారు. ఇక కోరోనావైరస్ కేసులను ఇప్పటివరకు ధృవీకరించిన దేశాలు ఇక్కడ ఉన్నాయి: 
రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 31 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 31 పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,163కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో ఇవాళ ఒకరు