• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

కొవిడ్ అంబులెన్సులను ప్రారంభించిన కేటీఆర్

హైద‌రాబాద్‌: కేటీఆర్ బ‌ర్త్ డే.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మానికి అనూహ్య స్పందన ల‌భించిన విష‌యం తెలిసిందే. మంత్రి కేటీఆర్ పిలుపునకు స్పందించి పార్టీ నేతలు దాదాపు వంద అంబులెన్సులను ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషించ‌ద‌గ్గ విష‌యం. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ఎందరో పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న‌ద‌ని ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధు

లు అభినందించారు. కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపిన ఆరు కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులను గురువారం ఉద‌యం ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి కేటీఆర్ ఈ అంబులెన్స్‌ల‌ను జెండా ఊపి ప్రారంభించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కేటీఆర్ సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య పాల్గొన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో పలువురు అంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేటీఆర్ కి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇవి కొవిడ్ రెస్పాన్స్ వాహనాలుగా పనిచేస్తాయి.
 

Related News

కేటీఆర్, రజినికాంత్ కు మెగస్టార్ సవాల్

కేటీఆర్, రజినికాంత్ కు మెగస్టార్ సవాల్

మెగాస్టార్ చిరంజీవి ఛాలెంజ్ స్వీకరించారు. ఇంట్లో శుభ్రం చేస్తూ, అమ్మకు ఉప్మా పెసరట్టు చేసిపెట్టారు. అంతటితో ఆగిపోకుండా నేను రోజు చేసే పనులే...ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం అంటూ  చిరు చమత్కరించారు.
పోలీసుల 'లిమిట్' లొల్లి.. నలుగురు మృతి

పోలీసుల 'లిమిట్' లొల్లి.. నలుగురు మృతి

పోలీసుల నిర్లక్ష్యం నలుగురు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైంది. చావుబతుకుల్లో ఉన్న వారిని కాపాడాల్సిందిపోయి పరిధుల పంచాయతీ పెట్టడంతో ముగ్గురు చిన్నారులతో సహా నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.