• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఇక క్షణాల్లో కరోనా ఫలితం తెలిపే టెస్టింగ్ కిట్‌

న్యూఢిల్లీ: కరోనా పరీక్షలు నిర్వహించిన తరువాత రిజల్ట్ కోసం కనీసం ఒక్కరోజైనా వేచి ఉండాల్సిందే. అయితే ఇకనుంచి ఆ కష్టం తొలగనుంది. దీనికోసం భారత్‌తో కలిసి ఇజ్రాయెల్ ఓ సరికొత్త కరోనా టెస్టింగ్ కిట్‌ను తయారు చేస్తోంది. ఈ కిట్ సాయంతో క్షణాల్లో కరోనా పరీక్ష నిర్వహించడమే కాకుండా రిజల్ట్‌ కూడా పొందవచ్చని చెబుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ సాయంతో ఈ పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా బాధితులను వెంటనే గుర్తించడంతో పాటు వారి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకునేందకు అవకాశాలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ ప్రధానాధికారి డాని గోల్ద్ మాట్లాడుతూ, శబ్దం, శ్వాస, శరీర ఉష్ణోగ్రతలను గుర్తించడం ద్వారా ఈ పరికరం పనిచేస్తుందని వెల్లడించారు.
 

Related News

ఆంధ్రప్రదేశ్ కరోనా సమాచారం

ఆంధ్రప్రదేశ్ కరోనా సమాచారం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ఓకేరోజులో 4వేలు పైన కేసులతో రికార్డ్ స్థాయిలో కొనసాగుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న మరణాలు. ఒకేరోజు 54 మంది చనిపోవడం అనేది ఆందోళన కలగజేసే విషయం. గడచిన 24 గంటల్లో 33,580 మంది నమూనాలు పరీక్షించగా
వరంగల్ లో తొలి కరోనా మరణం నమోదు

వరంగల్ లో తొలి కరోనా మరణం నమోదు

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను తెలంగాణ సర్కారు కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
దేశంలో క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది

దేశంలో క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది

దేశంలో క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది.  రోజు రోజుకూ కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్న సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  వ‌రుస‌గా రెండ‌వ రోజు కూడా పాజిటివ్ కేసులు ఏడు వేలు దాటాయి.  గ‌త 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా కొత్త‌గా 7964 పాజిటివ్ కేసులు
తెలంగాణలో  కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు

ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1813 కు చేరింది. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 33 జీహెచ్‌ఎమ్‌సీలోనే నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 19 నమోదయ్యాయి. ఈ రోజు కరోనా పాజిటివ్‌ వచ్చి చికిత్స తీసుకుని తిరిగి కరోనా నెగెటివ్‌ వచ్చి డిశ్చార్జ్‌ అయిన వారు
కరోనా కేసులు సంఖ్య తెలుస్తే షాక్ అవుతారు

కరోనా కేసులు సంఖ్య తెలుస్తే షాక్ అవుతారు

కరోనా మహమ్మారి 213 దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50,84,932కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 27 లక్షల 33 వేల 400. వ్యాధి నుంచి 20 లక్షల 21 వేల 813 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయి వెళ్లారు. కాగా
ప్రపంచ వ్యాప్తంగా కరోనా అప్ డేట్స్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా అప్ డేట్స్

ప్రపంచ దేశాలను వణికిస్తున్నది కరోనా వైరస్‌. ఈ మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 46,28,821 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటివరకు 3,08,654 మంది బాధితులు మృతిచెందారు. అన్ని దేశాల్లో కలిపి 17,59,702 బాధితులు కోలుకున్నారు. మరో 25,60,465 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
భారత్‌లో కరోనా విలయతాండవం

భారత్‌లో కరోనా విలయతాండవం

భారత్‌లో కరోనా వైరస్‌ విలయతాండవ చేస్తోంది. రోజురోజుకు కరోణా మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 100 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 3,967 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య
కోరోనా వైరస్ పూర్తి అప్ డేట్స్

కోరోనా వైరస్ పూర్తి అప్ డేట్స్

రెండు లక్షల 92 వేల మంది మరణించారు. అయితే 16 లక్షల రెండువేల 155 మంది వ్యాధి భారిన పడినా కోలుకున్నారు. ఇక కోరోనావైరస్ కేసులను ఇప్పటివరకు ధృవీకరించిన దేశాలు ఇక్కడ ఉన్నాయి: 
రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 31 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 31 పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,163కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో ఇవాళ ఒకరు