హైద‌రాబాద్‌: సీపీఐ రాష్ట్ర కార్యాల‌యంపై దాడికిపాల్ప‌డిన ఇద్ద‌రిని న‌గ‌ర పోలీసులు అరెస్టు చేశారు. న‌గ‌రంలోని హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో ఉన్న పార్టీ కార్యాల‌యంపై ఆదివారం సాయంత్రం ఇద్ద‌రు వ్య‌క్తులు దాడికి పాల్ప‌డ్డారు. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట్‌రెడ్డి వాహ‌నంతోపాటు మ‌రో వాహ‌నంపై దాడిచేశారు. అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన వాచ్‌మెన్ సురేంద‌ర్‌పై కూడా దాడిచేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులిద్ద‌రు పాత‌బ‌స్తిలోని ఛ‌త్రినాక వాసులుగా పోలీసులు గుర్తించారు. వారిని ఈరోజు ఉద‌యం నారాయ‌ణ‌గూడ పోలీసులు అరెస్టుచేశారు. వారిపై కేసు న‌మోదుచేసి, పార్టీ కార్యాల‌యంపై దాడికి గ‌ల కార‌ణాల‌ను గురించి తెలుసుకుంటున్నారు.