తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌లో ఘోర విమాన ప్ర‌మాదం సంభ‌వించింది. ఎయిరిండియా విమానం(IX-1344)  ప్ర‌మాదం భారిన ప‌డింది. శుక్ర‌వారం రాత్రి 7.40 గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. కోజికోడ్‌లోని క‌రిపూర్ విమానాశ్ర‌యంలో ల్యాండింగ్ స‌మ‌యంలో విమానం అదుపుత‌ప్పి ర‌న్‌వేపై క్రాష్ అయింది. ఈ ప్ర‌మాదంలో విమానం రెండు ముక్క‌లు అయింది.  వందే భార‌త్ మిష‌న్‌లో భాగంగా విమానం దుబాయ్ నుంచి కోజికోడ్‌కు చేరుకుంది. విమానంలో 191 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. వీరిలో 174 మంది ప్ర‌యాణికులు, 10 చిన్నారులు, ఇద్ద‌రు పైల‌ట్లు, ఐదుగురు క్యాబిన్ క్రూ సిబ్బంది. పైల‌ట్‌, కో-పైల‌ట్ స‌హా ఐదుగురు మృతిచెందిన‌ట్లుగా ప్రాథ‌మిక స‌మాచారం. 24 అంబులెన్స్‌లు ప్ర‌మాద స్థ‌లానికి చేరుకున్నాయి. జిల్లా విప‌త్తు నిర్వ‌హ‌ణ బృందం సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టింది. భారీ వ‌ర్ష‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని డీజీసీఏ ప్ర‌క‌టించింది. ఎయిర్‌పోర్టులో భారీ వ‌ర్షం కార‌ణంగా స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లుగుతోంది. ప్ర‌మాద పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. కేర‌ళ హెల్ప్‌లైన్ నెంబ‌ర్లు 0565463903, 0543090572, 0543090572.