మరో ఘోర రైలు ప్రమాదం
Posted on: Mar 30 2017
కాన్పూర్:
ఉత్తరప్రదేశ్లో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జబల్పూర్(మధ్యప్రదేశ్) నుంచి హజ్రత్నిజాముద్దీన్(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్ ఎక్స్ప్రెస్ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. యూపీలోని కుల్పహాడ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మొత్తం ఎనిమిది బోగీలు పట్టాల నుంచి పక్కకు ఒరిగిపోయాయి. సమాచారం అందుకున్నవెంటనే సహాయ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించిందా, లేదా అనేది తెలియాల్సిఉంది. కాగా, ఇటీవల పలు రైలు ప్రమాదాల్లో ఉగ్రవాదుల హస్తం ఉందని తేలిన నేపథ్యంలో మహాకోశల్ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
