• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

గులాబి సైనికుడిలా పనిచేస్తా : దాస్యం

 


వరంగల్ : సమ్మక్క-సారలమ్మ, భద్రకాళి అమ్మవార్ల దీవెనలతో, తెలంగాణ ఉద్యమకారులు దివంగత జనార్ధన్ రావు, ప్రొ.జయశంకర్ ,కాళోజి, దాస్యం ప్రణయభాస్కర్ల స్ఫూర్తితో రాజకీయంగా ఎదిగానని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం హన్మకొండ బాలసముద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వినయ్ భాస్కర్ ఆయన మాట్లాడారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా నియామకం చేసిన సీఎం కేసీఆర్, టిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఉద్యమకారుడిగా.. పార్టీ విధేయుడిగా తనను గుర్తించి ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞుడనని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం నుంచి గులాబి సైనికుడిలా పనిచేస్తూ, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానన్నారు.  కార్పోరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే గా ఎదిగాన నేను ప్రజల మనిషిగా వుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని, అదే తరహాలో ప్రభుత్వ చీఫ్ విప్ గా అసెంబ్లీలో ప్రతిపక్షాలు, మిత్రపక్షాలను కలుపుకుపోతానని అన్నారు.

సీఎం కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతను క్రమశిక్షణతో నెరవేరుస్తానని ఈ ప్రెస్ మీట్ లో దాస్యం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో నా ఆత్మీయ సోదరుడు కేటీ రామారావుగారు, నేను పరస్పరం సహకరించుకున్నామని ఉద్యమ తీరుతెన్నులను దాస్యం గుర్తుకు తెచ్చుకున్నారు. తెలంగాన ప్రజానికాన్ని ఏకతాటిపైకి తెచ్చి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆత్మీయ గురువర్యులు సీఎం కేసీఆర్ కృషి చేశారని అన్నారు. పార్టీకి వినయవిధేయునిగా వుంటూ , తనకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నెరవేరుస్తానన్నారు. టీఆరెస్ పార్టీ  వరంగల్ అర్బన్ కార్యాలయాన్ని దసరా రోజున కేటీఆర్ తో ప్రారంభించడానికి సిద్దం చేస్తున్నట్లు దాస్యం తెలిపారు.

Related News