• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

తెలంగాణ నుంచి క‌దిలే రైళ్ల వివరాలు

హైద‌రాబాద్‌: వచ్చే నెల 1 నుంచి పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్‌ రైళ్లకు ఇవాళ‌ ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమంకానున్న‌ది. టికెట్లు  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలి అని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే స్టేష‌న్లలో కౌంటర్లు బంద్‌ ఉంటాయి. నాన్‌ ఏసీ, మరియు ఏసీ కోచ్‌లనూ నడుపనున్నారు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్లు  ఉన్నాయి.  సికింద్రాబాద్‌, నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ల నుంచి కొన్ని రైళ్లు క‌ద‌ల‌నున్నాయి.  వాటి జాబితా ఇదే. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వ‌చ్చే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ముంబాయి నుంచి హైదరాబాద్ మ‌ధ్య న‌డిచే హుస్సేన్‌ సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మ‌ధ్య న‌డిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌, హౌరా నుంచి సికింద్రాబాద్ మ‌ధ్య న‌డిచే ఫలక్‌ను మా ఎక్స్‌ప్రెస్‌,  సికింద్రాబాద్ నుంచి డనపూర్ వెళ్లే సూపర్‌ఫాస్ట్‌, గుంటూరు నుంచి సికిం ద్రాబాద్ మ‌ధ్య న‌డిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి నుంచి నిజామా బాద్ మ‌ధ్య న‌డిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌కు ఇవాళ ఉద‌యం నుంచి రిజ‌ర్వేష‌న్ టికెట్ సౌక‌ర్యం క‌ల్పించ‌నున్నారు.
 

Related News

సికింద్రాబాద్‌కు నేడు తొలి రైలు

సికింద్రాబాద్‌కు నేడు తొలి రైలు

లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక బుధవారం తొలిసారిగా ప్రయాణికుల రైలు సికింద్రాబాద్‌కు రానుంది. బెంగళూరు-దిల్లీ మధ్య నడిచే ఏసీ సూపర్‌ఫాస్ట్‌(రాజధాని) ప్రత్యేక రైలు మంగళవారం రాత్రి 8.30 గంటలకు కేఎస్‌ఆర్‌ బెంగళూరు స్టేషన్‌ నుంచి ఆరంభమై బుధవారం ఉదయం 7.55 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది
ఐదు లక్షలు ఇస్తాం : సీఎం ఉద్ధవ్‌ థాక్రే

ఐదు లక్షలు ఇస్తాం : సీఎం ఉద్ధవ్‌ థాక్రే

గుడ్స్‌ రైలు ప్రమాదంలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ. ఐదు లక్షలు చెల్లించనున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే ప్రకటించారు. మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోని
వలస కూలీల తరలింపునకు కేంద్రం పచ్చజెండా

వలస కూలీల తరలింపునకు కేంద్రం పచ్చజెండా

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని పలుచోట్ల చిక్కుకుపోయిన కూలీలు, విద్యార్థులు, యాత్రికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర  హోంశాఖ రాష్ట్రాలను ఆదేశించింది.