• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

భారత్ లో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం

న్యూఢిల్లీ : చైనాకు భారత ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ రక్షణ, భద్రతను దృష్టి పెట్టుకొని టిక్‌టాక్‌ సహా షేరిట్‌, యూసీ బ్రౌజర్‌, బైడు మ్యాప్‌, ఎంఐ కమ్యూనిటీ, క్లబ్‌ ఫ్యాక్టరీ తదితర 59 యాప్‌లను బ్యాన్‌ చేసింది.ఈ నెల 15న లడాఖ్ గాల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో ఓ కర్నల్‌ సహా 20 మందికి భారత సైనికులు మృతువ్యాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో దేశవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశానికి చెందిన వస్తువులను, యాప్‌లను వినియోగించొద్దని, వాటిని బ్యాన్‌ చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆ దేశంలో తయారైన వస్తువులను పగులగొట్టి మరీ తమ నిరసనను తెలుపుతున్నారు. మరియు కేంద్ర నిఘావర్గాలు సైతం దేశానికి చెందిన సమాచారం బయటి దేశానికి వెళ్తుందని, వాటిని బ్యాన్‌ చేయాలని, వాడకుండా ప్రజలకు పిలుపునివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రం ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

 

షీ ఇన్, క్ల‌బ్ ఫ్యాక్ట‌రీ, హెలో, లైకి, బ్యూటీ ప్ల‌స్, విగో వీడియో, క్లీన్ మాస్ట‌ర్ , క్యామ్ స్కాన‌ర్, ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోర‌ల్‌, వీ మేట్, క్లాష్ ఆఫ్ కింగ్స్, ఎమ్ ఐ వీడియో కాల్‌, హాగో యాప్,  వివిధ ర‌కాల యాప్ లు నిషేధిత జాబితాలో ఉన్నాయి. 


 

Related News

అతి త్వరలో వాట్సాప్​లో సరికొత్త ఫీచర్స్

అతి త్వరలో వాట్సాప్​లో సరికొత్త ఫీచర్స్

ఎప్పటినుంచో వేచి చూస్తున్న సరికొత్త ఫీచర్స్ వాట్సాప్​లో అతి త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మేరకు కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. యానిమేటెడ్​ స్టిక్కర్స్, క్యూఆర్​ కోడ్స్, వెబ్​ వాట్సాప్​కు డార్క్ మోడ్​, క్వాలిటీ
గూగుల్‌ పే యాప్‌ను ఆర్‌బీఐ బ్యాన్‌ చేసిందా..?

గూగుల్‌ పే యాప్‌ను ఆర్‌బీఐ బ్యాన్‌ చేసిందా..?

భారత్‌లో గూగుల్‌ పే యాప్‌ను ఆర్‌బీఐ బ్యాన్‌ చేసిందంటూ సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తున్న పుకార్లపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఎన్‌పీసీఐ శుక్రవారం స్పందిస్తూ.. గూగుల్‌ పే యాప్‌ను ఇండియాలో బ్యాన్
వాట్సప్ యూజర్లకు శుభవార్త

వాట్సప్ యూజర్లకు శుభవార్త

వాట్సప్ యూజర్లకు శుభవార్త. త్వరలో మీ వాట్సప్ అకౌంట్‌ను నాలుగు డివైజ్‌లలో వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం లేదు. స్మార్ట్‌ఫోన్‌తో పాటు డెస్క్‌టాప్‌లో మాత్రమే వాట్సప్ ఉపయోగించుకోవచ్చు. కానీ త్వరలో మల్టీపుల్ డివైజ్‌లలో వాట్సప్ ఉపయోగించుకునేలా సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. వాట్సప్‌కు సంబంధించిన