• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

దేశంలో వ్యాక్సినేషన్‌లో తెలంగాణ టాప్‌

హైదరాబాద్‌ : వ్యాక్సినేషన్‌లో దేశంలోనే తెలంగాణ టాప్‌గా నిలిచింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ల వాడకం 62 శాతం ఉండగా.. తెలంగాణలో 67.5 శాతం ఉన్నట్టు వెల్లడయింది. ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం ముందంజలో ఉన్నది. నవజాత శిశువులకు వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం కొత్త వ్యాక్సిన్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేసింది. యూనివర్సల్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమంలో భాగంగా రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ను రాష్ట్రంలోని చిన్నారులకు అందించేందుకు వైద్యశాఖ కార్యాచరణ చేపట్టింది. ఈ ఏడాదే టీడీ వ్యాక్సిన్‌ను తీసుకురాగా, రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ను వచ్చేనె ల సెప్టెంబర్‌లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. 2.5 మి.లీ. రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ 6 మి.లీ. ఓరల్‌ సిరంజితో నోటి ద్వారా చిన్నారులకు ఇస్తారు. ఏడాది లోపల పిల్లలకు రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ మొదటి మోతాదును ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు వారాల వ్యవధిలో రోటా వైరస్‌ టీకాను 3 మోతాదుల్లో ఇస్తే.. నవజాత శిశువులు రోగ నిరోధక శక్తిని పొందగలుగుతారు.

Related News