• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

తెలంగాణ మంత్రివర్గంలో మరో ఆరుగురికి చోటుహైదరాబాద్: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పూర్తైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి విజయవంతంగా మరో ఆరుగురికి చోటుకల్పించారు. కేటీఆర్, హరీశ్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా ప్రాధాన్యతను బేరీజు వేసుకున్న కేసీఆర్ వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రాజభవన్ లో కొత్త గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్.. కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. మొట్టమొదటగా మంత్రి హరీశ్ రావు ప్రమానస్వీకారం చేశారు. హరీశ్ రావు పేరు పిలవగానే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం హరీశ్ రావు వెళ్లి కేసీఆర్ కాళ్లకు నమస్కారం చేశారు. హరీశ్ రావు తర్వాత కేటీఆర్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం తర్వాత కేటీఆర్ వెళ్లి సీఎం కేసీఆర్ కాళ్లకు దండం పెట్టారు. కేటీఆర్ తర్వాత పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్ ఎల్పీ విలీనం కావడంతో ఆమె టీఆర్ఎస్ సభ్యురాలిగా మారిపోయారు. సబితా ఇంద్రారెడ్డి తర్వాత గంగుల కమలాకర్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గంగుల కమలాకర్ తర్వాత మహబుబాబాద్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం తర్వాత సత్యవతి రాథోడ్ వెళ్లి సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. సత్యవతి రాథోడ్ తర్వాత చివరిగా పువ్వాడ అజయ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటికే కేసీఆర్ తో కలిపి కేబినెట్లో 12 మంది ఉన్నారు. కొత్తగా మరో ఆరుగురు రావడంతో మంత్రుల సంఖ్య 18కి చేరింది. 

మంత్రులు, వారి శాఖలు :

1.సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి, జిఎడి, శాంతి భద్రతలు, రెవెన్యూ, ఇరిగేషన్ సీఎం వద్దనే.

2. మహమూద్ అలీ: హోంమంత్రి.

3.ఇంద్రకరణ్ రెడ్డి : అటవీ, పర్యావరణం, శాస్త్ర - సాంకేతిక, దేవాదాయ, న్యాయ శాఖలు

4.తలసాని శ్రీనివాస యాదవ్ : పశు సంవర్థకం, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలు

5.గుంటకండ్ల జగదీశ్ రెడ్డి : విద్యుత్ శాఖ

6.ఈటల రాజేందర్ : వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు

7.సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి : వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్.

8.కొప్పుల ఈశ్వర్ : షెడ్యూల్డు కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, వృద్ధుల సక్షేమ శాఖలు

9.ఎర్రబెల్లి దయాకరరావు : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలు

10.వి.శ్రీనివాస్ గౌడ్ : ప్రొహిబిషన్ - ఎక్స్సైజ్, క్రీడలు - యువజన సేవలు, పర్యాటక - సాంస్కృతిక, పురావస్తు శాఖలు

11.వేముల ప్రశాంత్ రెడ్డి : రోడ్లు - భవనాలు, శాసనసభ వ్యవహరాలు, గృహ నిర్మాణ శాఖలు

12.చామకూర మల్లారెడ్డి : కార్మిక - ఉపాధి, ఫ్యాక్టరీలు, ఉపాధి కల్పన

13.టి.హరీష్ రావు:  ఆర్థిక శాఖ

Related News