• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

త్వరలో భారతీయుల స్విస్ బ్యాంకు వివరాలు గుట్టు రట్టు


న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న భారతీయుల అకౌంట్ వివరాలు ఎట్టకేలకు భారతీయ పన్ను అధికారులకు లభ్యం కానున్నాయి. స్విట్జర్లాండ్‌తో భారత్ గతంలో చేసుకున్న సమాచార మార్పిడి ఒప్పందం ప్రకారం స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల ఖాతాల వివరాల గుట్టు విప్పనుంది. ఇవాళ్టి నుంచే ఇరు దేశాల మధ్య చేసుకున్న సదరు ఒప్పందం అమలులోకి వచ్చింది. దీంతో ఆ ఖాతాల వివరాలు కూడా మనకు తెలియనున్నాయి. స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల ఖాతాల వివరాలను పొందేందుకు గాను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఆదాయపు పన్ను విభాగానికి ఓ విధానాన్ని అందుబాటులో ఉంచింది. ఈ మేరకు భారత అధికారులు 2018వ సంవత్సరంలో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు నిర్వహించిన అన్ని లావాదేవీలకు చెందిన వివరాలు పొందనున్నారు. అలాగే అదే సంవత్సరంలో క్లోజ్ చేసిన ఖాతాల వివరాలు కూడా అధికారులకు లభ్యం కానున్నాయి. ఈ క్రమంలో నల్లధనంపై పోరాడేందుకు మరింత బలం చేకూరుతుందని సీబీడీటీ అభిప్రాయ పడింది.
 

Related News