• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

పదవ తరగతి విద్యార్థులు పై తరగతికి ప్రమోట్

హైదరాబాద్‌: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలివున్న సందర్భంలో 10వ తరగతి పరీక్షలపై ముఖ్యంమంత్రి ఇవాళ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి  ఎస్.నర్సింగ్ రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో 5,34,903 మంది 10వ తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని సిఎం నిర్వహించారు. ఈ సమావేశంలో పదవ తరగతి పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏమి చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్దతిని ఖరారు చేశారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డిగ్రీ, పిజి తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Related News

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై
వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలోనూ బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని అన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు, సాంకేతిక సంస్థల్ని ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి’(ఏఐసీటీఈ)
వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలను జూన్‌ 3న నిర్వహించాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. జూన్‌ 3న ఇంటర్‌ రెండో సంవత్సర జాగ్రఫీ, మోడరన్‌ లాంగ్వేజీ పరీక్షలు జరుగుతాయని చెప్పింది. పాత హాల్‌ టికెట్లతో గతంలో
ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్‌ను జూలై రెండోవారం లేదా ఆగస్టు మొదటివారంలో నిర్వహించేందుకు ఉన్నతవిద్యామండలి సన్నాహాలు చేస్తున్నది. జాతీయస్థాయిలో జూలై 18
టెన్త్  పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

టెన్త్ పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

తాజాగా సోషల్ మీడియాలో ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది అని ఉదయం 8:00 నుండి 12:00 వరకు మొదటి పరీక్ష
పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్‌ గురువారం మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం