• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

వలస కూలీల పాలిట ఓ హీరో సోనూసూద్

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ప్రస్తుతం నటుడు సోనూసూద్ అంటే వలస కూలీల పాలిట ఓ హీరో.

కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ప్రస్తుతం నటుడు సోనూసూద్ అంటే వలస కూలీల పాలిట ఓ హీరో. అన్నా.. మేం ఫలానా చోట చిక్కుకుపోయాం అని అతడికి సమాచారం అందిస్తే చాలు ఎలాగైనా వారిని ఇంటికి చేరుస్తూ వారి పాలిట దైవంలా మారుతున్నాడు. వలస కూలీలను ప్రత్యేక బస్సుల్లో వారి సొంత గ్రామాలకు చేరుస్తున్నాడు. ఈ క్రమంలో సోనూ సూద్ ను సోషల్ మీడియా పొగడ్తల్లో ముంచెత్తుతోంది. కాగా.. తాజాగా సోనూసూద్ చేసిన పని చూసి మరింత ముక్కున వేలు వేసుకోవాలి. ఎందుకంటే, వలస కూలీలను సొంత గ్రామాలకు చేర్చడం కోసం అతడు ఏకంగా ఓ విమానాన్ని ఏర్పాటు చేశాడు. కేరళలోని ఎర్నాకుళంలో కుట్టుమిషన్ల కంపెనీలో పనిచేస్తున్న 177 మంది మహిళలు తమ సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లాలంటూ సోనూసూద్‌ను సాయం కోరారు. ఆ విషయం తెలిసిన వెంటనే వారి కోసం ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాడు. మరోవైపు.. సోనూ సూద్‌కు తెలిసిన నీతి గోయల్ అనే వ్యక్తి ద్వారా కేరళ, ఒడిశా ప్రభుత్వాలతో మాట్లాడి కొచ్చి, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో విమానం ఎక్కి, దిగే ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు సోనూసూద్ ప్రత్యేకంగా బుక్ చేసిన ఎయిర్ ఏసియా విమానం బెంగళూరు నుంచి కోచి వెళ్లింది. అక్కడి నుంచి 177 మంది మహిళలను తీసుకుని భువనేశ్వర్‌లో దింపింది. ఆ తర్వాత వారు అక్కడి నుంచి కేంద్రపార జిల్లాలో తమ తమ సొంత గ్రామాలకు వెళ్లే ఏర్పాట్లు కూడా చేశారు.
 

Related News

సోనూసూద్ మరో అడుగు ముందుకు

సోనూసూద్ మరో అడుగు ముందుకు

వ‌ల‌స కార్మికుల బాధ‌ల‌ని అర్ధం చేసుకున్న బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ప్ర‌తి ఒక్క‌రిని  వారి వారి స్వ‌స్థ‌లాలకి చేర్చాల‌ని ఎంత‌గానో తాప‌త్ర‌య‌ప‌డుతున్నాడు. ఇప్ప‌టికే బ‌స్సులు, రైళ్ళ ద్వారా కొంద‌రిని త‌ర‌లించిన సోనూ ఇటీవ‌ల కొచ్చి నుండి భువ‌నేశ్వ‌ర్‌కి ప్ర‌త్యేక ఫ్లైట్ ద్వారా దాదాపు 150 మందిని
వరంగల్ లో 9 కాదు 10 మందిని చంపింది ఒక్కడే

వరంగల్ లో 9 కాదు 10 మందిని చంపింది ఒక్కడే

ఎట్టకేలకు వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట కేసు మిస్టరీ వీడింది. తొమ్మిది వలస కార్మికులను సామూహికంగా హత్యచేసింది సంజయ్ కుమార్ యాదవ్ అనే బీహార్ వ్యక్తి అని తేలింది. మీడియాకు అంతుచిక్కని విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చిన ఈ మిస్టరీ మర్డర్ ను 72 గంటల్లో వరంగల్  పోలీసులు ఛేదించారు
గొర్రెకుంట బావి...హంతకుడు దొరికాడు

గొర్రెకుంట బావి...హంతకుడు దొరికాడు

గొర్రె కుంట గుట్టు వీడింది..బతికుండగానే బావిలో పడేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటనలో సంచలనం నిజం బయటపడింది. మూడు రోజులుగా జరుగుతున్న విచారణలో పోలీసులు గొర్రెకుంట మిస్టరీని చేధించారు. తొలి నుంచీ పోలీసులు అనుమానిస్తున్న విధంగానే
వరంగల్లో మిస్టరీగా మారిన  వలస కూలీల డెత్స్

వరంగల్లో మిస్టరీగా మారిన వలస కూలీల డెత్స్

వరంగల్ నగర శివారులోని గన్నీ సంచులు కుట్టే కంపెనీలో పనిచేసే వలస కూలీల అనుమానాస్పద మృతి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం రేపింది. తొమ్మిది మంది వలస కూలీల అనుమానాస్పద మృతి వరంగల్ పోలీసులకు సవాలుగా మారింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన తీరును పోలీసులకు వున్న అనుభవంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. అయినా ఎలాంటి ఆధారాలు దొరుకకపోవడంతో పోలీసులు షాక్ తింటున్నారు.
అప్పుడే పుట్టిన..బిడ్డ పేరు లాక్‌డౌన్

అప్పుడే పుట్టిన..బిడ్డ పేరు లాక్‌డౌన్

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న‌తో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. దీంతో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమితమ‌వడంతోపాటు వ‌ల‌స కూలీలు, వివిధ ప‌నులు కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లిన‌వాళ్లు ఎక్కిడికక్క‌డే చిక్కుకుపోయారు